కడప జిల్లా బద్వేలులో బద్వేలు పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 40 టన్నుల సామర్థ్యం గల మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ మరియు సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని బద్వేల్ డివిజన్ ఆర్డిఓ ఎ.చంద్రమోహన్ మరియు బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో గారు మాట్లాడుతూ, ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తడి–పొడి వ్యర్థాల వేరు వేరు సేకరణ, పునర్వినియోగం, కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలు ఈ కేంద్రం ద్వారా చేపట్టనున్నట్లు చెప్పారు.
బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ రూ.3.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రం రోజుకు 40 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ప్రజలు ఇంటి వద్దనే తడి–పొడి చెత్తను వేరు చేసి అందించడం ద్వారా పరిశుభ్రమైన బద్వేలు నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
0 Comments