పెట్రోల్ దాడిలో గాయపడ్డ దిలీప్ మృతి – పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు ఈరోజు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
0 Comments