కడప జిల్లా పోరుమామిళ్ల లోని శ్రీ మహర్షి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా యువఆచార్య చందులూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి యోగ సాధన చేయడం ద్వారా శారీరకంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చునని ధ్యానం ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకుని చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి గొప్ప అవకాశం అని అన్నారు. కరస్పాండెంట్లు భాస్కర్, గురు మోహన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో యోగా క్లాసుల ద్వారా విద్యార్థులు విద్యలో మంచి ఫలితాలు సాధించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ఈశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు..
0 Comments