*స్థానిక సంస్థల ఎన్నికలకు
బి. యస్. పి శ్రేణులు సిద్ధం కండి:
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు
శ్రీ బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు కడప జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సనహ సమావేశం స్థానిక ఆర్ &బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య పార్లమెంట్ ఇన్చార్జ్ డీ. యస్ జయరాం హాజరయ్యారు.ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని స్థానాల నుండి పోటీ చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎట్టి పరిస్థితుల్లో బిఎస్పీ సత్తా ఎన్నికల్లో చూపించాలని కచ్చితంగా గెలుపు దిశగా మన ప్రయాణం కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ, జిల్లా కార్యదర్శి టి . రవికుమార్, బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చందులూరి బ్రహ్మయ్య, మైదుకూరు అసెంబ్లీ అధ్యక్షులు రమేష్,కమలాపురం అసెంబ్లీ అధ్యక్షులు చంద్ర, కడప అసెంబ్లీ అధ్యక్షులు జాను, మరియు బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments