ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవ జవహర్ శుక్రవారం బ్రహ్మంగారి మఠం కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
సమావేశంలో దళితుల పట్ల కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలని నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.
దీనిపై స్పందించిన జవహర్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో మాట్లాడి దళితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దళితుల హక్కుల పరిరక్షణకు ఎస్సీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు, సగిలి విజయ్‌కుమార్, నారిపోగు మనోజ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బండి ఓబులేసు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల చినరాయుడు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు మొరతోటి ఆలివర్, సీనియర్ దళిత నాయకులు ఓబయ్య, కడుగు ప్రసాద్, చాటకొండ రవి, చాటకొండ గురయ్యతో పాటు దళిత సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
0 Comments