పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ నిత్యావసర వస్తులు ధరలు తగ్గించాలని సిపిఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

 నిత్యవసర వస్తువులు, డీజిల్,  పెట్రోల్ గ్యాస్ బండను భుజాన పై మోస్తూ నిరసన 

 డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ నిత్యవసర వస్తువుల రేట్లు తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ లు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరుమామిళ్ల గ్రామపంచాయతీ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధం షాపుగా చూపించి, డీజిల్ పెట్రోల్ పెంచి, మరోసారి ఐదు రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయింతవరకు ఎలాంటి రేట్లు పెంచమని ఓట్లు దండుకొని అందులోవెక్కిన తర్వాత  ఐదుసార్లు డీజిల్, పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలు బతకలేని విధముగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు

 ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా, దుశ్శాసనను లాగా ప్రజలను ఒకపక్క పీడించి, మరొకపక్క మతోన్మాదాన్ని పోషించి ప్రజలను జలగల్లా పీడించడం సిగ్గుచేటు అన్నారు.

 అలాగే కూరగాయల రేట్లు, నిత్యవసర వస్తువులు, రవాణా చార్జీలు, ట్రాన్స్ పోర్ట్ రంగం ఎక్కడి వాహనాలు  లారీలు, ఆల్వేన్లు ఆటోలు ఫైనాన్స్ వాళ్లకు అప్పజెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది.  పెరిగిన రేట్లు హోటల్ యజమానులు గ్యాస్ కొనలేక అర కోర హోటల్లో ఉంటే రెండు ఇడ్లీ 30 రూపాయలు, దోష నలబై ఈ విధంగా అన్ని రేట్లు పెరిగిపోవడం జరిగింది. వ్యవస్థ అంతా నాశమైపోవడానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోడీ, ప్రభుత్వం ప్రజలు పడే బాధలు, వారు పడే అగసాట్లు ఏవి కూడా కళ్ళు ఉంది  చూడలేని గుడ్డివాడిలాగా, చెవులుంది వినలేని చెవిటి వాడిలాగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా నిత్యవసర వస్తువుల రేట్లు తీసుకురావాలని, డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని కూటమి ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి కేశవ, సఫా పిరయ్య , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గౌస్య బేగం, మండల నాయకులు సోమయ్య రవి, ఇసాక్, షాహిదా, జాకోబ్, మేరీ, అలీ భాష, చంద్ర, రఫీ అధిక సంఖ్యలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments