ఐదుసంవత్సరాల లోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేయించడం వలన భవిష్యత్తులో పోలియో వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చునని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భవ్య అన్నారు. ఆదివారం వారు కాశి నాయన మండలంలోని రెడ్డి కొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పల్స్ పోలియో కార్యక్ర మంలో పాల్గొని చిన్నారు లకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించడం మనందరి బాధ్యత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించడం వలన 2014 తరువాత దేశంలో పోలియో కేసులు లేవన్నారు. పోలియో మహమ్మారి రాకుండా చంటి బిడ్డలను కాపాడుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కృష్ణమ్మ, ఆశా వర్కర్ సుహాసిని, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments