విద్యతో వ్యాపారం చేస్తున్న శ్రీ భాష్యం మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. : ఎస్ఎఫ్ఐ

(కడప టౌన్ ) పాఠశాలల ఆవరణంలోనే  పుస్తకాలు, యూనిఫామ్, షూస్, మరియు అనేక పేర్లతో   విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల,లక్షలు రూపాయలు దోపిడీ చేస్తూ  వ్యాపారానికి దిగబడిన   శ్రీ భాష్యం పబ్లిక్ స్కూల్ నీ అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం అనంతరం ప్రభుత్వ నిబంధనలు పాటించని శ్రీ భాష్యం పబ్లిక్ స్కూల్ సీజ్ చేయాలని పాఠశాల వద్దనే ధర్నా నిర్వహించిన  ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.
ధర్నా అనంతరం  వారు మాట్లాడుతూ....

 కడప నగరం లోని  ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థ లకి ఏమాత్రం తగ్గకుండా వారికి దీటుగా  చదువు అనే పేరుతో అక్రమ సంపాదనకు ప్రైవేట్ విద్యా సంస్థలు పాల్పడుతున్నాయని వారు అన్నారు. అదేవిధంగా శ్రీ భాష్యం పబ్లిక్ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అన్ని సదుపాయాలు ఉన్నాయని మాయమాటలతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పుస్తకాలు, యూనిఫామ్, షూస్, మెయింటినెన్స్ అనే అనేక పేరుతో వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు దీనిపైన ఎస్ఎఫ్ఐ ప్రశ్నించగా మేము ఉత్తములము అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతుండగా అడ్డుకోవడం జరుగుతుంది.దీనిని కేవలం కార్పొరేట్ వాళ్లు దోచుకుంటున్నారు  మమ్మల్ని ఎవరు గమనించగలరు అనే అపోహతో  ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఈ మధ్యకాలంలో  విచ్చలవిడిగా చదువుతో వ్యాపారం చేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ సంఘంగా అనేక విద్యార్థి సంఘాలుగా  కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ లోకల్ గా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు సానుకూలంగా ఉండడంతో ఆ సానుకూలతను చేతగానితనంగా ప్రైవేట్ విద్యాసంస్థలు మార్చుకొని ఫీజులు దోపిడీ, పాఠ్యపుస్తకాలు మరియు అనేక పేర్లతో అక్రమ సంపాదనకు  కేరాఫ్ అడ్రస్ గా కావడం దుర్మార్గం దీనిని భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ సంఘంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. దీనిని పైన అనేకమార్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు విన్నవించుకున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారు.ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి DEO గారు మరియు జిల్లా కలెక్టర్ గారు స్పందించి దోపిడీ చేసే ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు ఓంకార్, కార్తీక్, కుమార్, ఉదయ్, అభి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments