కడప జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని బుధవారం కడప డి. ఇ. ఒ కార్యాలయం లో జిల్లా విద్యాశాఖ అధికారి డి. ఇ. ఒ షంషుద్దీన్ కు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
కడప జిల్లా వ్యాప్తంగా చదువు అనే పేరుతో గుర్తింపు లేని విద్యాసంస్థలు నడుపుతున్న యాజమాన్యాలు చాలా ఉన్నాయి.అలాగే ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చదువుతో వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థల చర్యలు తీసుకోవాలని అనేకమార్లు చెప్పడం జరిగిందని వారన్నారు. జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగులు లాగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు మరియు, కోచింగ్ సెంటర్ల ముందస్తు అడ్మిషన్ల పేరుతో వేల,లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారని వారన్నారు.ఇప్పటికైనా గుర్తింపు లేని విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని లేని పక్షంలో రాబోవు రోజుల్లో ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాటిని అడ్డుకొని రాజీలేని పోరాటాలు చేస్తామని విన్నపించడం జరిగిందని వారన్నారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు ఓంకార్, అభి తదితరులు పాల్గొన్నారు.
0 Comments