పోరుమామిళ్లలో ప్రైవేట్ ఆసుపత్రులు, RMP క్లినిక్‌ల తనిఖీలు


కడప జిల్లా పోరుమామిళ్ల, జూన్ 15:
గత రెండు రోజులుగా పోరుమామిళ్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు మరియు RMP క్లినిక్‌లను వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, RMPలు తమ పేర్ల ముందు "డాక్టర్" అనే పదాన్ని ఉపయోగించరాదని సూచించారు.

అలాగే, RMPలు సెలైన్ బాటిల్స్ ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి వైద్య సేవలను అందించరాదని, కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని ఆదేశించారు. వైద్య నిబంధనలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

అనుమతులకు మించి వైద్య సేవలు అందించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ తనిఖీల కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు, HEO రఘు రాములు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments