ఉపాధ్యాయులు,పాత్రికేయులు అద్భుత సమాజ నిర్మాతలు : డీఈవో శంషుద్దీన్


కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెలో స్థానిక ఎస్.పి.ఎస్ ఫంక్షన్ హాల్లో పోరుమామిళ్ల  మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను ప్రతిభ పురస్కారాలలో భాగంగా  పదవ తరగతి లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి కడప జిల్లా డీఈవో శంషుద్దీన్ చేతుల మీదుగా 7116, 5116, 3116 లు నగదు బహుమతిని అందజేశారు. ఈ నగదు బహుమతులను అమెరికాలో ఉన్న గడ్డం వెంకటరమణయ్య,కమలమ్మ దంపతులు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాత్రికేయులు సమన్వయంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే అద్భుతమైన సమాజాన్ని నిర్మించవచ్చని,విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలరని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ ఆర్గనైజర్ గా గుండెబోయిన శ్రీనివాసులు, శ్రీమతి సుహాసిని కార్యక్రమాన్ని నిర్వర్తించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఏ.ఎం. ఓ విజయభాస్కర్, ప్రధానోపాధ్యాయులు, ఎం.ఈ.ఓ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments