ఉపాధి పనుల్లో కనిపించని అధికారుల పర్యవేక్షణ సిపిఐ
ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపిఐ బృందం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భద్రత కరువైందని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పోరుమామిళ్ల సిపిఐ బృందం ఉపాధి కూలీలు చేస్తున్న పనులను పరిశీలన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోరుమామిళ్ల సిపిఐ మండల సమితి బృందం పోరుమామిళ్ల, రంగసముద్రం పంచాయతీలో చేస్తున్న ఉపాధి హామీ పథకం పరిరక్షణకై,పేరు మార్చి, నిధుల కోతలతో పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం
ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలను కల్పించాలి కోరారు
ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పేరు మార్చి, నిధులు తగ్గించి నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
మండుతున్న ఎండల్లో గంటల తరబడి పనిచేస్తున్న మహిళలు, వృద్ధులు, దినసరి కూలీలకు తాగునీరు, నీడ సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు, విశ్రాంతి కేంద్రాలు వంటి వసతులు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశంలో వైద్య సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహించాలని కోరారు.
2005లో గ్రామీణ పేదల జీవనోపాధి కోసం కమ్యూనిస్టు పార్టీల దీర్ఘకాల పోరాటాల ఫలితంగానే ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం దేశంలో మొదటిసారిగా “పని చేసే హక్కు”ను చట్టబద్ధ హక్కుగా గుర్తించిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా కోట్లాది కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. ముఖ్యంగా రైతు కూలీలు, భూమిలేని పేదలు, చిన్న రైతులు, వలస కూలీలు, మహిళలకు ఈ పథకం జీవనాధారంగా మారిందని తెలిపారు.
అయితే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, పనిదినాలను పరిమితం చేయడం, కూలి చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం చేయడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆధార్ ఆధారిత చెల్లింపులు, మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు వంటి విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సాంకేతిక సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. నెట్‌వర్క్ సమస్యలు, బయోమెట్రిక్ లోపాల కారణంగా పని చేసిన కూలీల హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పని చేసిన తరువాత 15 రోజుల్లోగా కూలి చెల్లించాల్సిన చట్టపరమైన నిబంధన ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో వారాలు, నెలల తరబడి డబ్బులు జమ కావడం లేదని చెప్పారు. ఉపాధి హామీ పథకం బలహీనపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం, ఉపాధి కొరత, అకాల వర్షాలు, కరవు పరిస్థితుల మధ్య ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత 100 రోజుల ఉపాధిని కనీసం 200 రోజులకు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు సవరించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పనుల ఎంపికలో గ్రామసభలకు అధికారం ఇవ్వాలని, అవినీతి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా ఉపాధి హామీ పనులను కేవలం గుంతలు తవ్వే కార్యక్రమాలకే పరిమితం చేయకుండా చెరువుల పునరుద్ధరణ, భూసార పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, పశుగ్రాస అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ పనులకు అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో గ్రామీణాభివృద్ధికి తోడ్పాటుతో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
“ఉపాధి హామీ పథకం కేవలం సంక్షేమ పథకం కాదు.. ఇది గ్రామీణ పేదల జీవించే హక్కును కాపాడే చట్టం” అని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి పనులు అధికారులు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది వెంటనే అధికారుల అప్రమత్తమై జరుగుతున్న అవినీతిపైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు
0 Comments