ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చిన్న ప్రయత్నం చేయకపోవడం వల్ల కష్టాలు మరింత తీవ్రమై పెనం మీద నుండి పొయ్యిలో పడ్డచందంగా రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి.ఈనాడు ప్రభుత్వం యొక్క నడకలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల చుట్టూ తిరగడం వల్ల డొక్కలు ఎండిన చందంగా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని వెంటనే ప్రభుత్వం స్పందించి 12వ పి.ఆర్.సి కమిటీని ఏర్పాటు చేయాలని ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రమణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ సాధారణంగా పిఆర్సి అనేది కేవలం జీతం పెంపు ప్రక్రియ కాదు .ఉద్యోగుల జీవన భద్రత ,ఆర్థిక స్థిరత్వం ,సేవల పట్ల నిబద్ధతను ప్రభావితం చేసే ఒక వ్యవస్థాపక సంస్కరణ. ఫిట్మెంట్ శాతం ,డి ఏ విలీనం ,వేతన స్కేల్స్ పునర్నిర్మాణం, అల్వెన్స్ సవరణ వంటి అంశాలు అందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి .కానీ కూటమి ప్రభుత్వం 2023 జూలై నుండి ఇవ్వవలసిన పి ఆర్ సి అమలు ఆలస్యం కావడం వల్ల రిటైర్ అయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్ర నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని కావున ప్రభుత్వం వెంటనే 12వ పి.ఆర్.సిని అమలు పరచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యస్ టి యు నాయకులు రాజ గోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీను వాసులు పాల్గొన్నారు.
0 Comments