గోవులను రక్షించుకుందాం రండి...గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి...బిజెపి



బిజెపి ఆధ్వర్యంలో గోవుల సంరక్షణ కోసం గో సన్మాన్  అభియాన్ కార్యక్రమం
గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోవుల అక్రమ రవాణాను అరికట్టి, వాటిని రక్షించుకుందాం అంటూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హిందువులు గోవులను దైవంగా భావించి పూజలు చేస్తారు. అలాంటి గోమాతలను అక్రమంగా రవాణా చేస్తున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  కాశినాయన మండల బిజెపి  నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన         నరసాపురంలోని గోవుల సంరక్షణ కోసం గో సన్మాన్  అభియాన్ కార్యక్రమాన్ని    బిజెపి ఆధ్వర్యంలో  తహసిల్దార్ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి  మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి,భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తూ వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .గోవుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. దేవతగా పూజించే గోవులను చంపడం చట్టప్రకారం నేరమని చెప్పారు. వాటి రక్షణ కోసం తగు చర్యల తీసుకోవాలని నిర్దాక్షిణ్యంగా వధకు గురవుతున్న గోవుల ప్రాణాలను రక్షించాలని, భారత ప్రభుత్వం కఠినమైన చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఎదురు భాస్కర్ రెడ్డి, ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడు పోలేరు, బిజెపి నాయకులు నాగార్జున రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అభిలాష్,శివ, చిన్న ఓబయ్య పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments