డీజిల్,పెట్రోల్ కొరత చూపి బ్లాక్ లో అమ్ముతున్న ఐఓసీ డీలర్లపై చర్యలు తీసుకోవాలి సిపిఐ డిమాండ్

డీజిల్,పెట్రోల్ కొరత చూపి బ్లాక్ లో అమ్ముతున్న ఐఓసీ డీలర్లపై చర్యలు తీసుకోవాలి సిపిఐ డిమాండ్ 

 డీజిల్ పెట్రోల్ కొరత తీర్చాలని ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపిన సిపిఐ నాయకులు 

 పెట్రోల్ డీజిల్ అదనపు రేట్ల తో అమ్ముతున్న డీలర్లపై చర్యలు ఎక్కడ??? సిపిఐ సూటి ప్రశ్న 

 నిత్యవసర వస్తువు లాంటి డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనారని సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.

 పోరుమామిళ్ల సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టిసి బస్టాండ్ ఆవరణము నుండి ఆటో కు తాడుగట్టి భుజంపై తాడు లాగుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రతినిత్యం అవసరమైన డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ కొరత తీర్చడంలో విఫలమయ్యారని వారన్నారు

. అలాగే ఐఓసీ డీలర్లు డీజిల్, పెట్రోల్ లేదని నోటీసు బోర్డు ఏర్పాటు చేసి, రాత్రి సమయంలో అదనపు రేట్లు ల తో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న, బ్లాక్ మార్కెట్ మాఫియాగాలను ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఎవరికైనా రెవెన్యూ,పోలీస్, ఇతర ప్రభుత్వ అధికారులు అవసరమైతే వారికి పట్టడం, లేకపోతే పెట్రోల్ పంపు యజమానులకు, వారి బంధువులకు డీజిల్, పెట్రోల్ పడితే, మిగతా సంబంధించిన ఆటోలు, టాటా ఏసీలు, బోలోరోలు, లారీలు, వంటి వాహనాలు ఏదో ఒక రకంగా కార్మికులకు, ప్రజలకు, అవసరమయ్యే వాహనాలు, అలాంటి వాహనాలకు డీజిల్, పెట్రోల్ లేకపోతే ఇంకా ఇబ్బంది పడతారు ఒకసారి అధికారులు ఆలోచించాలని తెలిపారు

 అలాగే ప్రతి వాహనం ఏదో ఒక ఫైనాన్సులో పెట్టుకొని నెలవారి కంతులు కట్టాల్సిన పరిస్థితి, మరియు ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, ఈ విధంగా అనేక కుటుంబాలు ఉంటే వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడతారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మీదే ఆలోచించాలని వారు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బీజలు పెట్రోలు వంటగ్యాసు ప్రజలు అందుబాటులోకి తీసుకురావాలని లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమం చేపడుద్దామని వారన్నారు

 ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ, ఏఐటియుసి ఏరియా అధ్యక్షుడు సఫా, మండల అధ్యక్షులు పిరయ్య, మండల నాయకులు నరసింహులు, విష్ణు, ఆందోని, గురయ్యా, వెంకట సుబ్బారెడ్డి, చాంద్ భాషా, రామయ్య, సనమాల చెన్నయ్య, హసన్ వల్లి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments