సహాయం చేస్తారా! సారూ..* అంగవైకల్యంతో దాతల కోసం ఎదురుచూపులు.

.

కడప జిల్లా కాశీనాయన మండలంలోని బాలాయపల్లె హరిజనవాడకు చెందిన కందుల నయోమి (30) పుట్టుకతోనే అంగవైకల్యంతో ,తల్లిదండ్రులు లేక తమ నాయనమ్మ ఆదరణ చూపుతూ ఇంతకాలం వరకు జీవనం సాగిస్తూ కాలం గడిపింది. అయినవారు పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మ చేదోడు వాదోడుగా ఆమెను ఆదరించడం ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ వస్తున్నప్పటికీ వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మ ఎంత కాలం చూస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వమైన, మనసున్న దాతలు ఎవరైనా వీల్ చైర్ ను పంపిణీ చేస్తారని ఆమె మీడియా ముందు ప్రాధేయపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం దాతలు ముందుకు వచ్చి సలోమికి సహాయం చేస్తారని ఆశిద్దాం.
దాతల సహాయార్థం 7013304593 ఈ నెంబర్ను సంప్రదించవలసిందిగా ఆమె కోరడమైనది.

Post a Comment

0 Comments