*20 ఏళ్ల సమస్య నేడు పరిష్కారం.*
డోర్నకల్, ఫిబ్రవరి 21 : అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ రామచందర్ నాయక్ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు యాల్లవుల హరికృష్ణ యాదవ్ అన్నారు. శనివారం
డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గత 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఏరియా ఇప్పుడు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆశీస్సులతో 13వ వార్డులో మురళి యాదవ్ ఇంటి నుండి సెయింట్ ఆగ్నేష్ స్కూల్ వరకు సైడ్ కాలువ, సిసి రోడ్డు పనులు 13వ వార్డు కౌన్సిలర్ యల్లావుల సువర్ణ హరికృష్ణ, యాదవ నగర్ యూత్ సభ్యుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెల్లమేకల సుధాకర్, జక్కుల బ్రహ్మయ్య, యల్లావుల శివ గణేష్, జక్కుల సతీష్ ,జక్కుల లింగస్వామి, జాల వినయ్, దాసరి శ్రీకాంత్, కొత్త శివ, బడేటి గురవయ్య వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments