శ్రీ అవధూత కాశి నాయన మండల తహశీల్దారు గౌరవ వెంకటసుబ్బయ్య గారికి ఎస్ టి యు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాలయాపన చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఆర్థిక కార్యదర్శి యు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగ ,ఉపాధ్యాయులు ,పింఛనర్లకు ఆర్థికపరమైన అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పరిష్కరించాలని 12వ పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయడం, 30% మధ్యంతర భృతిని ప్రకటించడం, పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రకటించడం, సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయడం ,ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇవ్వవలసిన ఆర్థిక బకాయిలను వెంటనే పే స్లిప్పులో పొందుపరచడం ,రిటైర్డ్ అయిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు వెంటనే ఆర్థిక బెనిఫిట్స్ను అమలు పరచాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన ఆర్థిక కార్యదర్శులు వీవీ నారాయణ, టీ ప్రదీప్ ,జి.పిరు భాష ,రాష్ట్ర కౌన్సిలర్ వాకా చంద్రశేఖర్ ,జిల్లా ఉపాధ్యక్షులు బి .బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు రవీంద్రబాబు, నారాయణరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఏం రమణయ్య, నరసింహులు,జిల్లా కౌన్సిలర్లు, మండల కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని వినతి పత్రం సమర్పించారు.
0 Comments