పోరుమామిళ్ల పట్టణంలో పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోరుమామిళ్ల పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు భారీగా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బ్యాండ్ మేళాలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం దాదాపు 2000 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్,రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ, రంతు,కల్లూరు కృష్ణారెడ్డి, సీతా వెంకటసుబ్బయ్య,సీతా బాలాజీ, బసిరెడ్డి రవీందర్ రెడ్డి, అన్వర్,కరిముల్లా తదితర నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు
0 Comments