పోరుమామిళ్ల మండలంలోని వెలుగు కార్యాలయం నందు వైస్ ఎంపీపీ సీ.బాషా ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డి.సి గోవిందరెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ హాజరయ్యారు. వైస్ ఎంపీపీ సి భాష మాట్లాడుతూ మండలంలోని ఎంపీటీసీలు,జడ్పిటిసి,సర్పంచులు చేసిన అభివృద్ధి మరువలేనిదని కొనియాడారు. అధికారులు సహకరించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయాలని, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు,రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైస్ ఎంపీపీ రాజశేఖర్ మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలో కొత్తగా నిర్మించే డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్మాణం చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది అన్నారు.రాజకీయాలకు అతీతంగా నాయకులు,అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు తెలియజేశారు. రెవెన్యూ,వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించి అనంతరం సర్పంచులను శాలువాలతో సన్మానించి మెమెంటో లను అందజేశారు.అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి తదితర సర్పంచులు,మండల ఎమ్మార్వో, ఎంపీడీవో ఎంపీటీసీలు,బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, రెవెన్యూ,వ్యవసాయ శాఖ,విద్యుత్ శాఖ,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments