పోరుమామిళ్ల మండలంలోని కమ్మవారిపల్లెకు చెందిన టిడిపి యువ నాయకులు చెరుకూరి రవికుమార్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను తిలకించేందుకు మారుమూల గ్రామాల నుండి టిడిపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా కమ్మవారిపల్లెకు తరలివచ్చారు వీరి సమూహంతో కమ్మవారిపల్లె ఒకసారిగా జనసంద్రంగా మారిపోయింది మహిళలు సైతం ఆనంద డోలికల్లో తెలియాడుతూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు శుక్రవారం పోరుమామిళ్ల మండలంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కమ్మవారిపల్లెలో చెరుకూరి రవికుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిసిసి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జనసంద్రం చూస్తుంటే నోట మాట రావడం లేదని రైతు కుటుంబం నుండి తాను రాజకీయాల్లోకి వచ్చానని పార్టీలో పని చేసే వారందరికీ తన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామన్నారు అనంతరం చెరుకూరి రవి కుమార్ తో కలిసి టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళల మధ్య మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ జన సమూహంతో ర్యాలీ నిర్వహించారు తదనంతరం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఈ కార్యక్రమాలకు వేల సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు హైదరాబాదు నెల్లూరు నుంచి వచ్చిన జబర్దస్త్ కళాకారులు తమ కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో నాలుగుమండలాల నాయకులు పాల్గొన్నారు.
0 Comments