ఎరువులు అధిక రేట్లతో అమ్ముతున్న దొంగడీలర్లను అరెస్టు చేసి రైతులనుఆదుకోవాలని ,
సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అధికారులపై ఆగ్రహం
బద్వేల్ నియోజకవర్గం లో ఎరువుల డీలర్లు, యూరియా, పాస్పెట్, పురుగు మందులు అధిక రేట్లతో రైతుల వద్ద ముక్కు పిండి వసూలు చేయడం చాలా దారుణమని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పోరుమామిళ్ల పట్టణంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అధికారులపై, ఎరువుల దుకాణ యజమానులపై ఆగ్రహం చెందారు.
.ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం లో ప్రతి చెరువు నిండుకుండలా ఉండి అన్ని ప్రాంతాలలో ఒకేసారి వర్రీ, చోద్ద, మిరప, పత్తి, అరటి లాంటి పంటలకు ,అవసరమైన యూరియా, పాస్పెట్,, గుళికలు , పురుగు మందులు అవసరం అదునుగా,,అందులో యూరియా 450 రూపాయలు అధిక రేట్లు తో అమ్మడం. ఒకపక్క అయితే,
మరోపక్క సచివాలయాల్లో రైతుకు అవసరమైన ఎరువులు పురుగుల మందులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు అయిపోతాయో, అర్థం కాని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారని వారన్నారు.
అలాగే సచివాలయాల్లోకి వచ్చిన ఎరువులు కొంతమంది బడా బాబులకు మాత్రం రాత్రికి,రాత్రి టక్టర్లు ఆటోలతో తోలడం, చిన్న చిన్న సన్న కారు రైతులకు ఎప్పుడు సచివాలయం వద్దకు వెళ్లిన స్టాక్ వచ్చింది, అయిపోయినాయి అన్న పదము తప్పవేరొక పదం సచివాలయంలో ఉన్న సిబ్బందికి రావడం లేదు,
రబీ పంటలకు అవసరమైన వాటి కోసం రైతులు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దుకాణ యజమానులు ప్రభుత్వ రేటు కంటే 266 ప్రభుత్వ రేటు ఉంటే దాదాపు 400 నుండి 450 రూపాయలు రైతుల నుండి దౌర్జన్యంగా లాక్కున్న విధముగా వసూలు చేయడం చాలా బాధాకరం అని,
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ఒక వైపు రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు పురుగుమందులు అందుబాటులో ఉన్నాయి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తుంది . మరి బజారులోకెళితే రైతుల జేబులకు చిల్లులు పడుతున్నాయి దీని వ్యవసాయ అధికారులు పరిశీలన చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న దుకాణదారుల పైన క్రిమినల్ కేసులు బుక్ చేసి వారి లైసెన్సులను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నది. ఇలాగే దుకాణాల దారులు వ్యవహరిస్తే రైతులతో కూడి ఆందోళన బాట పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం తక్షణం ఏడి గారు ఏవో గారు దుకాణదారుల పైన దృష్టి పెట్టి వారి పైన తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమం లో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ, సఫా, పీరయ్య, చాంద్ భాష, రాయప్ప, నబి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments