విద్యాప్రదాత మార్గదర్శి దార్షినికుడు ముఖ్య వక్త ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఫణి రాజ కుమార్ స్థాపించిన హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ను మై వాయిస్ కోఆర్డినేటర్ పరిమళ జ్యోతి కాశి నాయన ,కలసపాడు మండల మై వాయిస్ స్కూల్ లెవెల్ విన్నర్స్ కు కాశినాయన మండలం రెడ్డి కొట్టాల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగం మీద రౌండ్ టేబుల్ డిస్కషన్ జరిగింది.భారత రాజ్యాంగం లోని అంశాలు గురించి వకృత్వ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరిమళ జ్యోతి హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణి రాజకుమార్ సహకారంతో ఎం.ఈ.ఓ నిర్మల, మహిమ షఫీ చేతుల మీదుగా మొదటి ,రెండవ, మూడవ మరియు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ వకృత్వ పోటీలో మొదటి బహుమతి కలసపాడు మండలంలోని జడ్పీహెచ్ఎస్ తెల్లపాడు పాఠశాలలోని గురు జైష్ణవి, రెండవ బహుమతి కాశి నాయన మండలంలోని జడ్పీహెచ్ఎస్ వంకమర్రి పాఠశాలలోని తేజిత, మూడవ బహుమతి కాశి నాయన మండలంలోని జడ్పీహెచ్ఎస్ నర్సాపురం పాఠశాలలోని హర్షిత్, జడ్పీహెచ్ఎస్ రెడ్డి కొట్టాల పాఠశాలలోని రషీదా కు బహుమతులను, హరిత ఫౌండేషన్ సర్టిఫికెట్స్ ను అందజేశారు మరియు ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఇంకా చెట్లను నాటే కార్యక్రమాన్ని చెట్లను విద్యార్థులకు దత్తత ఇవ్వడం జరిగింది. కాశి నాయన మండలం ఎంఈఓ నిర్మల, షఫీ కాసినాయన, కలసపాడు మండల ఉపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ రెడ్డి కొట్టాల ప్రధానోపాధ్యాయుడు వాకా చంద్రశేఖర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణి రాజ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments