పోరుమామిళ్ల మంగనపల్లె గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు సొంత ఖర్చులతో కల్వర్టు మోరి ఏర్పాటు చేసుకుంటే, పోరుమామిళ్ల పెద్ద చెరువు నుండి నీళ్లు వదిలినప్పుడల్లా పైపులు, మట్టి గ్రావెల్ కొట్టుకొని పోవడం, రైతులు నరకాన్ని చూస్తున్నారని తెలుగు గంగ కాలువకు నూతన బ్రిడ్జి నిర్మించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ , సిపిఐ బృందం అధికారులకు, పాలక ప్రభుత్వానికి తెలిపారు
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలోని మంగనపల్లె గ్రామంలో నిత్యం పొలంలో పంటలు పెడితే తప్ప వేరే పని తెలియని రైతన్నల కు కష్టాలకు ఆశలు నిరాశలలో అయ్యే పరిస్థితి నెలకొన్నదని వారన్నారు
ప్రతి సంవత్సరం కాలువకు అవతల భాగంలో ఉన్న పంట పొలాలకు పండిన పంటను ఇంటికి తీసుకురావాలన్న, పొలాలలోకి ఎరువులు పురుగులు మందులు, కూలీలు, పశువులు, మూగజీవాలు, రైతులు ఎవరు వెళ్లాలన్న తెలుగు గంగ కాలువ దాటుకొని అవతలికి వెళ్ళితే తప్ప ఏ ఒక్క ఎకరా పంట కూడా వర్షం వచ్చి, కాలవకు నీళ్లు వదిలితే తెచ్చుకోలేని పరిస్థితి నెలకొన్నది.
గతంలో ఉన్న పాలక ప్రభుత్వాలకు తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా తెలుగు గంగా కాలువకు బ్రిడ్జి నిర్మించి పంట పొలాలకు, వెళ్లేందుకు దారి ఏర్పాటు అయితే గ్రామంలోని ప్రతి రైతు కుటుంబ ప్రభుత్వానికి చిరస్థాయిగా వారి గుండెల్లో చెరగని ముద్దులుగా నిలుస్తుందని వారన్నారు.
ఇప్పుడు మిరప, బెండ, బీర, సొర టమోటా లాంటి పంటలు పొలాలకే పరిమితమై వదిలేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. లేదంటే సిద్ధవరం గ్రామం పై భాగంలో బ్రిడ్జి దాటుకొని కంప చెట్లు, మోకాళ్లలోతు గుంతలు, దాటుకొని ఐదు కిలోమీటర్లు వెళ్లితే తప్ప పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది
కనుక, అధికారులు, పాలక ప్రభుత్వం స్పందించి తెలుగు గంగా కాలువకు నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసి రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే విధంగా పాలక ప్రభుత్వం బ్రిడ్జి పూర్తి చేయాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలోమండల సహాయ కార్యదర్శి కేశవ, ఏరియా కార్యవర్గ సభ్యులు, జాకబ్ , ప్రసాద్, విష్ణు, గ్రామ ప్రజలు రామిరెడ్డి, సూర్య నారాయణ రెడ్డి, సుబ్బయ్య, గురయ్యా, తదితరులు పాల్గొన్నారు
0 Comments