బద్వేల్ నియోజకవర్గం లో దళిత యువకులు, నిన్న కందుల దిలీప్, మొన్న ఇమ్మానియేల్, పందీటి ఓబులేసు.ముడమాల సతీష్ ఇలా ఒకరి తరువాత ఒకరిని అగ్రకులాలవాళ్ళు, చంపుకుంటా పోతుంవుంటే, ఏ ఒక్కరిని కూడా యస్ సి, అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపకపోవడం కనీసం కేసుకూడా నమోదు చేయకుండా కనీసం ఎవరు చంపారు అనేది కూడా గుర్తించకుండా కేసును తప్పు దావా పట్టించడం చాలా దారుణం అని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, డిహెచ్పిఎస్ ప్రసాద్, ఏరియా కార్యోగ్య సభ్యులు కేశవ, సఫా, రాయప్ప లు పోరుమామిళ్ల విలేకరుల సమావేశంలో జరుగుతున్న అఘాయిత్యాలపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీపు గురుత్రిత్తే పార్సల్ కొరియర్ బాయ్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ వారి తల్లి పెరాలసిస్ వ్యాధితో మందానికే పరిమితమైన కుటుంబం అలాగే కలసపాడు మండలం ముద్దమవారిపల్లె గ్రామానికి చెందిన ఇమ్మానియేలు అబ్బాయిని వాగ్దేవి కాలేజీలో సాయంత్రం వరకు పేవరల్ పార్టీ ఉన్న వ్యక్తి అదేరోజు రాత్రి సమయంలో నిర్మానుషమైన ప్రదేశంలో తీసుకెళ్లి చంపడం చాలా బాధాకరం,గత వారం రోజుల క్రితం బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామం సతీష్, ఓబులేసు అనే యువకులను చంపి తెలుగు గంగ కాలువలో చంపి పడవ వేస్తే, చివరకు పోలీసు వారికీ తెలిసి కూడా, కేసు నమోదు చేయకపోవడం సంఘాలు ఉద్యమం చేస్తే తప్పుడు ,కేసు నమోదు చేసి మామా అనే రీతిలో కొనసాగించడం. ఈ హత్యలు అన్ని ప్రేమ పేరుతో దళితులు ను చంపడం జరిగింది. పేరుకు బద్వేల్ నియోజకవర్గం నాయకులు మంచివాళ్ళు చనిపోయినప్పుడు ప్రజలతో ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకొని, అగ్రకులాల వారి దగ్గర ఉంటే మనకు ఎలాంటి భయం లేదు అన్న రీతిలో తో చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పై పై నమ్మకం వచ్చే విధంగా ఈ నలుగురు కేసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు
0 Comments