ఘనంగా పోరుమామిళ్ల రాఘవేంద్ర నగర్ లో కోటి సంతకాల సేకరణ



 పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చిత్త గిరి ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగసముద్రం పంచాయతీ ఉప సర్పంచ్ రుద్రవరం ప్రసాద్ ,జడ్పిటిసి ముత్యాల ప్రసాద్,ఎంపీటీసీ మహబూబ్ పీరా
 జల్లి చంద్రయుడు, జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షుడు చాపాటి సాయి నారాయణ రెడ్డి, బాలుడు, కంబాల శివ, వార్డు మెంబరు వెంకటసుబ్బయ్య తదితర నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments