ప్రభుత్వ అనుమతి లేని శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి .

 కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా పాఠశాల శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బుధవారం పోరుమామిళ్ల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

 చదువు పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాలను సీజ్ చేయాలని అలాగే ప్రస్తుతం ఉన్న పాఠశాల గతంలో కలసపాడు మండలంలోని మార్గదర్శి అనే విద్యా సంస్థతో గుర్తింపు చెందినది కానీ ఇప్పుడు వేరొక మండలం నుంచి పోరుమామిళ్ల పట్టణం పాఠశాల గుర్తింపుగా ఉంది అని విద్యార్థులను విద్యార్థుల,తల్లిదండ్రులను నమ్మించి అన్ని వసతులు ఉన్నాయని వేల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న పాఠశాల యాజమాన్యం పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అలాగే జిల్లాలోని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు భాను ప్రకాష్ , నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments