స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం: బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బసిరెడ్డి మనోహర్ రెడ్డి



స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి
విదేశీ వస్తువులను బహిష్కరిద్దామని బిజెపి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు .బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు బిజెపి ఆత్మ నిర్బర్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాన్ని కాశినాయన మండలం చెన్నవరం గ్రామంలో బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మండల ప్రవాసి రమణాచారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ భారతదేశ భవిష్యత్తు కోసం తీసుకున్నటు వంటి ఆత్మ నిర్బర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒకరూ కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు అన్నిపంచాయతీలతో శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ నియామకాలు చేపట్టాలని వారు ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు అవుతున్న తీరును ప్రజల్లో అడిగి తెలుసుకున్నారు. మనదేశంలో ఆత్మ నిర్భయ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం స్వదేశీ నినాదం కాదు మన జీవన విధానం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తాం స్వదేశీ స్వాభిమానం స్వాలంబన కార్యక్రమాన్ని ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో మనందరం కలిసి భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా, బలమైన ఆర్థిక శక్తిగా నిర్మాణం చేయాలని తెలిపారు. స్వదేశీయ వస్తు వినియోగాన్ని ప్రోత్సహించి, స్వదేశీ నినాదంతో మరింత ముందుకు సాగినట్లయితే మన దేశంలో నూతన పరిశ్రమలు యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి కాశినాయన మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మండల కార్యదర్శి బిజీవేముల నారాయణరెడ్డి, బిజెపి నాయకులు వంకెల వెంకటరమణారెడ్డి,బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments