కడప జిల్లా కాశినాయన మండలం కత్తెర గండ్ల గ్రామంలో వెలసిన శ్రీ బాల త్రిపుర సుందరిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా దాతలు మన్నూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన్నూరు రామ్మోహన్ రెడ్డి,ఉపాధ్యాయుడు ఇండ్ల రామకృష్ణారెడ్డి అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాసులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం పురోహితుడు కిషోర్ శర్మ ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతం జరిపించారు. దాతలు మన్నూరు రామ్మోహన్ రెడ్డి,ఇండ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా భక్తాదులకు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పరమేశ్వరుని ఆశీస్సులు అందరికి ఎల్లవేళలా
ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments