వైసీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ *

 బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల టౌన్ తంబాబా వీధిలో జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదగా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గార్లు మాట్లాడుతూ*

*ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” ప్రారంభించింది. ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంస్కరణలను రద్దు చేసి, ప్రజలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను ప్రైవేటు బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.*

*జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య రాష్ట్ర వైద్యరంగాన్ని సువర్ణ యుగంలోకి తీసుకెళ్లిందని పార్టీ పేర్కొంది. రూ.9,480 కోట్లతో 7 కొత్త మెడికల్ కాలేజీలు, 10,032 విలేజ్ క్లినిక్స్, 528 అర్బన్ క్లినిక్స్, 125 పీహెచ్‌సీలు, 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల బలోపేతానికి భారీగా నిధులు ఖర్చు చేశారు. 5 కొత్త గిరిజన మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, 5 సూపర్ స్పెషాల్టీ బ్లాక్స్, 6 క్యాన్సర్ సెంటర్లు, 3 హార్ట్ హబ్‌లు, 108–104 సర్వీసులకు వందలాది వాహనాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా పథకం ద్వారా పేషెంట్లకు ఆర్థిక సహాయం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా కోట్ల మందికి సేవలు అందించటం వంటి సంస్కరణలు అమలు చేశారు.*

*1923 నుండి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నప్పటికీ, వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే సంకల్పంతో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించింది. విజ్ఞానగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా పూర్తయ్యాయి. ఈ కాలేజీల వల్ల జిల్లాల వారీగా సూపర్ స్పెషాల్టీ వైద్యం అందుబాటులోకి వచ్చింది, MBBS సీట్లు 2,390 నుండి 4,910కి పెరిగాయి. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం, విద్య అందే మార్గం ఏర్పడింది.*

*అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిలిపివేసి, వాటిని ప్రైవేటీకరించే కుట్ర పన్నింది. 2025 జనవరి 23న జారీ చేసిన జీవో ద్వారా మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ వంటి పది కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల ప్రజారోగ్య రంగం పూర్తిగా దెబ్బతింటుందని పార్టీ హెచ్చరించింది.*

*ప్రైవేటీకరణ వల్ల వైద్య సేవలు ఖరీదవుతాయి, పేదలకు అందుబాటులో ఉండవు, ప్రజా వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రజలను దోపిడీ చేసే ప్రమాదం ఉందని పార్టీ పేర్కొంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజలకు ఆధారమయ్యాయని, అప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యత తీసుకోలేదని గుర్తు చేసింది. అంతేకాక, టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, రూ.3,800 కోట్ల బకాయిలు వదిలిందని, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజ్ క్లినిక్స్, 108–104 సర్వీసులను కూడా బలహీనపరచిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.*

*ప్రజా వైద్యం ప్రజల హక్కు, ప్రజల ఆస్తి అని, దీన్ని ప్రైవేటీకరించే కుట్రకు ప్రతిఘటించేందుకు ప్రతి పౌరుడు చైతన్యవంతుడై ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని పార్టీ పిలుపునిస్తోంది.*

*ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి,జిల్లా అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాజీవ్ భాష, గాజుల పల్లె రవిచంద్ర రెడ్డి, వారితోపాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments