ఆదర్శ పాఠశాల విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.
అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీకి ఎంపికైన శ్రీనిత్ రెడ్డి.
అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థి శ్యామ్ శ్రీనిత్ రెడ్డిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. రాప్తాడు మండలంలోని ఆదర్శ పాఠశాలలో భారత రాజ్యాంగం" అంశంపై రాప్తాడు నియోజకవర్గ స్థాయిలో వకృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో ఆరు మండలాల విద్యార్థులు పాల్గొనగా.. ప్రతిభ చూపిన ఆరుగురు విద్యార్థులకు తిరిగి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో స్థానిక ఆదర్శ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శ్యామ్ శ్రీనిత్ రెడ్డి మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఆదర్శ పాఠశాల విద్యార్థితో పాటు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే పరిటాల సునీతను అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. ఈనెల 26న జరగబోయే మాక్ అసెంబ్లీలో కూడా ప్రతిభ చూపించి..రాప్తాడు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సునీత సూచించారు.
0 Comments