రేపే మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు.


నవంబర్ 4న జరిగే మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జనవిజ్ఞాన వేదిక పోరుమామిళ్ళ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిమె. గురయ్య, ఖాసీం వల్లి ఒక ప్రకటన లో తెలిపారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోరుమామిళ్ళ నందు మండలస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
జరుగనున్నాయని,కనుక ప్రధానోపాధ్యాయులు స్కూల్ లెవెల్ లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన తమ విద్యార్థులను తీసుకొని ఉదయం 10 గంటల కల్లా హాజరు కావాలన్నారు.
మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారికి
ప్రథమ, ద్వితీయ, తృతీయ
బహుమతులు అందిస్తామన్నారు.

మండల స్థాయి విజేతలకు సర్టిఫికెట్లు,మెడల్స్ తో పాటు, మెమొంటోలు,పుస్తకాలు బహూకరించబడతాయన్నారు. ఈ కార్యక్రమం విజయ వంతంగా నిర్వహించేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించాలని వారు కోరారు.

Post a Comment

0 Comments