రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కాకుండా దేవుళ్ళ చిత్రపటాల నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పోరుమామిళ్ల మండలం నర్సింగపల్లె ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు ఏ. జయరామిరెడ్డి ఇలా చేయడం వివక్ష ను ప్రవర్తించడంమే.ఇది రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను అవమానించడమే అవుతుందని అంబేద్కర్ వాదులు,సామాజిక కార్యకర్తలు, ప్రజలు భావిస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయా? లేవా, మరి ఇటువంటి ఉపాధ్యాయులు ఉన్నత స్థానంలో ఉండి కూడా భావి భారత పౌరులను తయారు చేసేటువంటి స్థితిలో ఉండి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
0 Comments