భూ కబ్జాదారులకు అండగా ?? రెవిన్యూ కార్యాలయాన్ని అవినీతికి కేరాఫ్ గా మార్చడం సిగ్గుచేటు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ రెవిన్యూ అధికారులపై ఆగ్రహం
కలసపాడు మండలం మారేళ్ళ పల్లె నరవ దళితులకు. కుత వేటు దూరములో ఉన్నటువంటి 2707/లో సుమారు 285 ఎకరాలు ప్రభుత్వ బంజరు భూమి ఉండగా ,, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు యదేచ్చగా రాత్రికి రాత్రి జెసిబిలు , డోజర్లు పెట్టి చదును చేసి, బొప్పాయి ,జామ, మామిడి తోటలు పండిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులకు కనపడలేదా అని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ( బికేఎంయు) కడప జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం సిపిఐ - వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలు పిండిని చేస్తూ మండల ప్రముఖ వైసీపీ నాయకులు అయినా పురుషోత్తం రెడ్డి , రెవెన్యూ అధికారులను లోపరుచుకుని అధికార ఆర్థిక అండదండలతో, భూములు కొల్లగొట్టినప్పటికీ ఎందుకు రెవిన్యూ అధికారులు స్పందించడం లేదని తక్షణమే ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి , సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేకుంటే సోమవారం నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
మండలంలో ఇదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా భూ అక్రమంలో జరుగుతున్నాయని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడవి భూములను కాపాడుతామని, ఒకవైపు ప్రగల్బాలు పలుకుతా ఉంటే దాదాపు 280 ఎకరాల అటవీ భూమికి రెక్కలు వస్తే రెవెన్యూ అధికారులు కానీ అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారు అని వాస్తవానికి నరవ దళిత దళితవాడలో 50 సంవత్సరాలుగా నివాసముంటున్నప్పటికీ ఏ ఒక్క దళితునికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి మూడు సెంట్లు స్థలం దక్కలేదని ఆ దళితులకు భూములు ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు అవిశ్రాంత పోరాటం నిర్వహిస్తామని రెవిన్యూ అధికారులు ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పార్టీ ప్రతి పేదవాడికి మేమే పద్దుతామని ఆయన హెచ్చరించారు
కలసపాడు రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో, ఆర్ ఐ, తాసిల్దారి వరకు ముడుపులు తీసుకోవడం పరిపాటిగా మారిందని , అందుకే ఇంత పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయని వీటిపై బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి ఒక టాస్ స్పోర్ట్స్ టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సహాయ కార్యదర్శి పి.వి.రమణ, కలసిపాడు మండల కార్యదర్శి సునీల్, వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా అధ్యక్షులు పొంగూరు నాగరాజు, ఏరియా కార్యవర్గ సభ్యులు రవికుమార్, కేశవ, సనమాల చెన్నయ్య, సఫా, చాంద్ భాష, చిన్నప్ప,,, గ్రామ ప్రజలు హృదయ రాజు, బాలయ్య, వీరేంద్ర చంద్రశేఖర్, అభినయ్, పెద్ద నాగయ్య, మరియమ్మ, జ్యోతి, రమేష్ కొత్తపల్లి భాస్కరు అదేక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు
0 Comments