*12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి*

*12వ పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి* 
రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ,ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న12వ పిఆర్సి కమిషన్ ను వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎస్టియు జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఇటీవల ఒక డి.ఏ మాత్రమే ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పట్టీ పట్టనట్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు త్వరగా ఇవ్వాలని, భోధనేతర కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను మినహాయిచాలని కోరారు.

Post a Comment

0 Comments