సగిలేరు నీటిలో కాడి ఎద్దులు బలి , శోక సముద్రం లో రెడ్డి కొట్టాల పేద రైతు
కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన భావనగాల శివ రైతు కాడెద్దులు కాటికి ?? రైతు కన్నీటి గాధ
కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన రైతు కాడెద్దులు ఒక వారం క్రితం లక్ష 70 వేలకు కొనుగోలు చేసుకుని మొదటిసారి పొలంలోకి నారుదొడ్లు లలో దుక్కి దున్ని తయారు చేయుటకు రెడ్డి కొట్టాల గ్రామం పై భాగంలో ఉన్న సగిలేరు నది ఒడ్డున అవతల వైపు పొలం దున్నేందుకు వెళ్లి ఉదయం నుండి సాయంత్రం వరకు పొలం తయారుచేసి సాయంత్రం 4:30 నిమిషాల సమయంలో తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్లాలని ఏటి వద్దకు వచ్చి పశువులను నీళ్లు త్రాగించి, మట్టిని శుభ్రం చేసి ఇంటికి వెళ్లాలని సిద్ధమైన రైతు సగిలేరు వద్దకు వెళ్లే లోపు కొత్త ఎద్దులు రావడం వాటి విధానం రైతుకు తెలియకపోవడం వెంటనే నీటిలోకి వెళ్లిపోయి రైతు ఎంత కష్టపడి వాటిని లోతు నీళ్లల్లోకి వెళ్లకుండా ఆపలేకపోవడం చివరకు రైతు ప్రాణాలే పోతాయని భయంతో ఏదో ఒక విధంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఒడ్డుకి చేరడం జరిగింది. ఈ లోపు ఎద్దులు మెడపై కాడిమాను ఉండడం పెనుగులాడుకొని, రైతు ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేక అనంత లోకాల్లోలకి కాడెద్దులు వెళ్లడం జరిగింది గ్రామస్తులకు సమాచారం అందించి, గ్రామంలోని ట్రాక్టరు, మోకులు సహాయంతో బయటికి లాగి, సగిలేరు నది ఒడ్డున జెసిబి తో గుంతలు తీసి కూల్చి వేయడం జరిగింది . రైతు ఎన్నో ఒడిదుడుకుల, ఎదుర్కొని , కుటుంబ సమస్యలు అధికమించి కాడి ఎద్దులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారని అనుకున్న లోపే రైతుకు సగిలేరు నది కి ఎద్దులను బలి తీసుకోవడం చాల బాధాకరం ఆ కుటుంబానికి అండగా దాతలు ముందుకు రావాలని రెడ్డి కొట్టాల పేద రైతు ప్రజలకు, పాలకులకు మనవి చేస్తున్నాము రైతు కు సహాయం అందించు దాతలు ఫోన్ పే నెంబర్ 9381104605 సహాయం అందిస్తారని మనవి . ఈ కార్యక్రమంలో రెడ్డి కొట్టాల ప్రజలు పాల్గొన్నారు.
0 Comments