*భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూలు పై చర్యలు ఏవి?- ఏబీవీపీ*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)




అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పోరుమామిళ్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పోరుమామిళ్ల నగరంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నడుపుతున్నటువంటి భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని మూడు రోజుల క్రితం ఎంఈఓ వెంకటయ్య గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.వినతిపత్రం ఇచ్చి మూడు రోజులు అవుతున్నప్పటికీ మండల విద్యాశాఖ అధికారి గారు నిమ్మకు నీరెక్కనట్లు ఉండటంపై అనేకమైనటువంటి సందేహాలు మాకు కలుగుతున్నాయని వారన్నారు .మండల విద్యాశాఖ అధికారి గారిని ప్రశ్నిస్తూ మీరు కూడా భాగ్యలక్ష్మి పబ్లిక్ పాఠశాల దగ్గర నుంచి ముడుపులు పుచ్చుకొని విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసార? అని ప్రశ్నించారు. నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అని నమ్ముతున్నటువంటి మన భారతదేశంలో రేపటి విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు తీసుకోకుండా నడిపిస్తున్నటువంటి భాగ్యలక్ష్మి పబ్లిక్ పాఠశాల పై చర్యలు తీసుకోండి అయ్యా... అని వినతిపత్రం ఇస్తే భాగ్యలక్ష్మి పబ్లిక్ పాఠశాల గురించి నోరు మెదపకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో నుంచి బయటికి వచ్చి మీ స్వలాభాల గురించి కాకుండా విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్ ని "సీజ్" చేయాలని వారు అన్నారు.అదేవిధంగా అనుమతి పత్రాలు తీసుకోకుండా భాగ్యలక్ష్మి పబ్లిక్ పాఠశాలని నడిపిస్తున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేసారు.లేనిపక్షంలో రానున్న రోజుల్లో మండల విద్యాశాఖ అధికారి గారి కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా ఏబీవీపీ వెనకాడబోదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రమణ,చంద్ర, కార్తీక్,సాయి,హర్ష,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments