ఘనంగా బి కోడూరు లో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

 

 ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, కర్షక, ప్రజా సంఘాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘం ఏఐటీయూసీ 

దేశంలో. కార్మికుల.హక్కులకోసం, సంక్షేమంకోసం ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ 10 6 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ మండల కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి విజయరావు పేర్కొన్నారు. 

ఈసందర్భంగా సిపిఐ మండల నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు ఏఐటియుసి గా ముంబై నగరంలో ఆవిర్భవించి ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల కోసం పోరాటం చేసిన కార్మిక సంఘం అన్నారు.స్వాతంత్రం కోసం, కార్మిక హక్కుల కోసంకార్మికులపనిగంటలు, కార్మిక చట్టాల కోసం,సంక్షేమం భద్రత కోసం ఏఐటీయూసీ పోరాట ఫలితంగా కార్మిక చట్టాలు వచ్చాయన్నారు .

 అయితే ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులు కాల రాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ప్రైవేటు సంస్థలకు అనుకూలంగాచట్టాలుచేస్తుందనివారు

ఎంతోమంది ప్రాణాలు అర్పించి .పోరాడి సాధించుకున్న 44 కార్మి క చట్టాలను రద్దు చేసివాటి స్థానంలోకేవలం నాలుగు కోడ్ లుగాచట్టాలనురూపొందించిందన్నారు. కార్మికులు చెమట చుక్కలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలుపరిశ్రమలుఅన్నింటిని ఒక్కొక్కటిగాప్రైవేటీకరణచేస్తుందని ప్రైవేటీకరణకువ్యతిరేకంగాపోరాటం చేయాల్సిన బాధ్యతప్రతిఒక్కరి పై ఉందన్నారు. దేశంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరే కంగా ఏఐటియుసి కట్టుబడి గట్టిగా పోరాటం చేస్తుందన్నారు.ప్రైవేటీకర ణ అంటేనే వ్యాపారం అని వ్యాపార సంస్థలు వ్యాపారం చేస్తాయి తప్ప ప్రజల సంక్షేమం కోసం కనీస వేతనము సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని సుప్రీంకోర్టు చట్టాలు ఉన్నప్పటికీ కనీస వేతనమ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసి, కార్మికుల శ్రమదోపిడి చేస్తున్నారని వారు మండిపడ్డారు ఇప్పటికైనా ఇండియా ప్రభుత్వం పాలక ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలనివారుకోరారు.    
   
ఈ కార్యక్రమంలో ఒబయ్య, మరియన్నా, నారాయణ, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments