ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమం వాయిదా.


  
 రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాను ఉండడం వల్ల అనివార్యకారణాల కారణంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ ఈనెల 30,31 జరిగే కార్యక్రమాన్ని వచ్చేనెల అనగా నవంబర్ 12,13 తేదీలలో కడప నగరంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుందని గురువారం కడుప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు. కావున పాల్గొనే విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు గమనించగలరని విజ్ఞప్తి అదేవిధంగా అతి త్వరలోనే మీకు పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మోహన్, అఖిలేష్, మనోహర్, తదితరులు లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments