స్థానిక టేకూరుపేట ఆంజనేయ స్వామి గుడి ముందు పోరుమామిళ్ల చెరువు కింద ఉండే చెర్లోపల్లి రెవెన్యూ గ్రామాల రైతుల 12 39వందలఎకరాల బాధితుల సదస్సు పోరుమామిళ్ల మండల రైతు సంఘం యన్ భైరవప్రసాదు, కల్లూరి రాజారెడ్డి అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మినేని ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.....
పోరుమామిళ్ల చెరువు నీటి కారణంగా ముంపుకు గురి అవుతున్న 10 గ్రామాలకు సంబంధించిన 1239 ఎకరాల పంట పొలాలను కృష్ణా జలాల ముంపు నుండి కాపాడాలని అలా సాధ్యం కాని పక్షంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలనీ వారు డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల చెరువు క్రింద పోరుమామిళ్ల మండలంలోని టేకూరు, టెకూరుపేట, తిరంగలాపురం, సూరుసిద్ది పల్లె, దాసరి పల్లె తిమ్మారెడ్డి పల్లె, కవల కుంట్ల, తోకల పల్లె, కొర్రపాటి పల్లె తదితర గ్రామాలకు సంబంధించిన సుమారు 1239ఎకరాల వ్యవసాయ పంట భూములు బ్రహ్మ సాగర్ జలాశయం నుండి వచ్చిన నీటితో అక్టోబర్ నెల చివరలో మునిగిపోయాయని వారు తెలిపారు.ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు సాగుచేసిన వరి, మొక్కజొన్న, సొద్ద, చిక్కుడు, కాకర, బీర, చౌల కాయలు వంటి కూరగాయల పంటలు పూర్తిగా మునిగిపోయాయి. ఒక్కొక్క రైతు ఎకరానికి సగటున 30 వేల రూపాయల నుండి 40 వేల రూపాయలు ఈ పంటలపై పెట్టుబడిగా పెట్టారని ఒక రూపాయి కూడా రైతుకు చేతికి రాలేదని తెలిపారు. బద్వేల్ చెరువు మరియు దిగువన ఉన్న ఇతర చెరువులకు నీళ్లు ఇచ్చేందుకు తెలుగు గంగ అధికారులు పోరుమామిళ్ల చెరువును సామర్థ్యానికి మించి నీరు నిల్వ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు
ఈ సంవత్సరం బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ లో పూర్తిస్థాయిలో నీటిని విలువ చేశామని తెలుగు గంగా అధికారులు ప్రకటించారు. ఆ మేరకు సాగు విస్తీర్ణం పెరిగిందని, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందిస్తున్నామని ప్రకటించారు. నిర్ధారించిన ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడం అభినందనీయం. అయితే సామర్ధ్యానికి మించి పోరుమామిళ్ల చెరువులో నీళ్లు నిలువ చేయడం వల్ల 1239 ఎకరాల భూములు నీట మునిగిపోయి వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పంటలన్నీ కోల్పోయారని అన్నారు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామానికి 5,6 మంది రైతులకు మాత్రమే నష్టపోయారని జాబితా రూపొందించడం సరైనది కాదని ఆయన తెలిపారు.2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఎకరాకు 15 లక్షలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు భూ సేకరణ చట్ట ప్రకారము ప్రతి రైతుకు భూమి చూపించి వారికి 15 లక్షలు ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలని వారు అన్నారు ఈ సందర్భంగా చెర్లోపల్లె రెవెన్యూ మునక ప్రాంత పోరాట రైతాంగ నూతన కమిటీ కన్వీనర్ గా భైరవ ప్రసాద్ కల్లూరు రాజారెడ్డి ఎన్నిక జరిగింది
వీరితోపాటు గ్రామానికి ఇద్దరు చొప్పున 30 మంది కమిటీ సభ్యులు తిరుమల కొండారెడ్డి పోల్ రెడ్డి గురువి రెడ్డి అబ్బిరెడ్డి నాగిరెడ్డి పుల్లారెడ్డి దశరమిరెడ్డి కృష్ణారెడ్డి ఆదినారాయణ రెడ్డి నాగభూషణం చెన్ను వెంకటసుబ్బయ్య జయమ్మ తెలిపారు విజయ స్వామి గురవయ్య విజయ శేఖర్ రెడ్డి ఓబయ్య రామచంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైనారు
ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ వీరభద్రుడు వీరయ్య రవి రాజు బాల వీరయ్య వెంకటేశ్వర్ రెడ్డి బొజ్జ వెంకటసుబ్బయ్య చెన్నకేశవులు పుల్లయ్య మేకలు పిచ్చయ్య మేకల బాలయ్య పెంచల్ రెడ్డి రామలక్ష్మి రెడ్డి ఈశ్వర్ రెడ్డి పోవల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
0 Comments