బి కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో ఎంపీపీస్ స్కూల్ నందు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు బొండిగల శ్రీనును మున్నెల్లి సర్పంచ్ గురయ్య, మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కొత్తగా జాయిన్ అయిన టీచర్ కె శ్రావణికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ సునీల్ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు వృత్తినే దైవంగా భావిస్తూ అంకితభావంతో తాను పనిచేసిన పాఠశాలలో తనదైన చెరగని ముద్ర వేసుకుని పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డాడన్నారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పుతూ విద్యార్థులతో మమేకమై గ్రామస్తులతో మమేకమై అందర్నీ కలుపుకుపోతూ బదిలీపై ఏరేచోటికి వెళ్లడం చాలా బాధగా ఉంది అన్నారు. గ్రామస్తులందరూ కూడా ఉపాధ్యాయుడిని శాలువాలతో సన్మానించి గ్రామంలోబ్యాండ్ తాళాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ విజయలక్ష్మి,వైస్ చైర్మన్ సుమతి ఉపాధ్యాయులు కే. శ్రావణి. బాబురావు,రాజగోపాల్ రెడ్డి, జానయ్య, వివి కృష్ణారెడ్డి,ఎస్ వి సత్యరాజు,కే లక్ష్మీదేవి,ఎల్ పుల్లారెడ్డి,బి నాగ సుబ్బారెడ్డి,ఎస్ భాస్కర్ రెడ్డి, బి వెంకటరామయ్య, సీఆర్పీ పి సావిత్రి,విలేకరి రామచంద్రయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments