మురికివాడలా మారిన సుందరయ్య కాలనీ

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సుందరయ్య కాలనీలో మురికి నీరు, కాలువల్లోని డ్రైనేజీ, కంప చెట్లు తొలగించి ప్రజలను రక్షించాలని సుందరయ్య కాలనీ అధికారులను కోరుతున్నారు. ఆ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు మొత్తం గృహాల వద్దకు వచ్చి దుర్వాసనతో,దోమలు చేరి అనేక విష జ్వరాలతో అల్లాడే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.ఎన్నిసార్లు ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినను వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments