28 ఏళ్ల తర్వాత పోరుమామిళ్ల పెద్ద చెరువులో నీటి ప్రవాహం — ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందిజనసేన మండలం నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య



పోరుమామిళ్ల, అక్టోబర్ 25:
గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాల కారణంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పెద్ద చెరువు 28 సంవత్సరాల తర్వాత నిండిపోయింది. ఎప్పటినుంచీ ఎండిపోయిన చెరువు ఈసారి నీటితో కళకళలాడుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులో నీరు పుష్కలంగా ఉండగా, కేవలం ఒక అడుగు మాత్రమే తక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో మరికొద్ది వర్షం కురిస్తే చెరువు అలుగు పారే అవకాశం ఉందని శీలంశెట్టి లక్ష్మయ్య తెలియజేశారు.

పైప్రాంతాల నుంచి కూడా నీరు పుష్కలంగా వస్తున్నాయని, కొండుగారి పల్లె, తూమ్ నుంచి కూడా ఎక్కువ మొత్తము నీళ్ళు వెళ్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా చెరువును పరిశీలించిన జనసేన నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ, “గత 28 సంవత్సరాలుగా పోరుమామిళ్ల పెద్ద చెరువు ఇంత స్థాయిలో నిండిన సందర్భం లేదు. ఈసారి చెరువు నిండిపోవడం రైతులు, గ్రామస్థులందరికీ ఎంతో ఊరటనిస్తోంది. కంభం చెరువు తర్వాత ఈ ప్రాంతంలో రెండవ పెద్ద నీటి నిల్వ పోరుమామిళ్ల చెరువే” అని, 
— “ఇది కేవలం చెరువు నింపడం కాదు, మా ఊరికి మళ్లీ జీవం పోసినట్టే. భవిష్యత్తులో వ్యవసాయం, భూగర్భ జలాల పెరుగుదలకు ఇది చాలా ఉపయోగపడుతుంది” అని తెలిపారు.

Post a Comment

0 Comments