చెకుముకి సైన్స్ సంబరాలు జయప్రదం చేయండి-కాశి నాయన మండలం కార్యదర్శి జీ.వీ. చంద్రశేఖర ఆచారి



జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని ఆ సంస్థ మండల కార్యదర్శి జీ.వి .చంద్రశేఖర్ ఆచారి పిలుపునిచ్చారు. బుధవారం నరసాపురం మోడల్ స్కూల్ నందు కళాశాల ప్రిన్సిపల్ సౌజన్య మేడం ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి జి.వి. చంద్రశేఖర ఆచారి మాట్లాడుతూ జేవీవీ ఆధ్వర్యంలో అక్టోబర్ బర్ 18న పాఠశాల స్థాయిలో, నవంబర్ 1న మండల స్థాయిలో, నవంబర్ 23న జిల్లాస్థాయిలో పరీక్షలు ఉంటాయన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులందరూ ఈ పరీక్షల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృందం బాలిరెడ్డి, చంద్ర, జానకి దేవి, సుస్మిత తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments