కాశినాయన మండలం పరిధిలోని నాయన పల్లె ఆకుల నారాయణపల్లె అక్కింగుండ్ల రెవెన్యూ గ్రామాల పరిధిలోని పేద ప్రజలు భూమికోసం దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారి జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు
బుధవారం ఉదయం తాసిల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు పాల్గొన్న గ్రామాలు సావిశెట్టిపల్లె కొట్టాల ఆకుల నారాయణ పల్లె నాయన పల్లె వరికుంట్ల తదితర గ్రామాల భూమిలేని పేద ప్రజలు మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు
వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది అదే విధంగా అక్కింగుల్లా రెవెన్యూ పొలం ప్రత్యేక తాసిల్దారు గారిచే విచారణ తొందర్లో ఆర్డీవో విచారణ నిర్వహిస్తున్నారని తెలిపారు
ఆకుల నారాయణపల్లె పేదలు సర్వేనెంబర్ 2227 కొండపోరంబోకు భూమిగా ఆర్ఎస్ఆర్ లో ఉన్నది కాబట్టి ఆర్డీవో ట్రాన్సాక్షన్ చేయాల్సింది ఉందన్నారు
రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి భూ పంపిణీ ప్రకటించిన వెంటనే అర్హులైన పేదలకు భూమి ఎకరా నర చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు
ప్రభుత్వ భూమి బినామీ పేర్లతో 30 ఎకరాలు 50 ఎకరాలు చొప్పు ఆక్రమించుకొని చేస్తున్న వారి పైన తాసిల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన వెంటనే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో పేదలు సాగు చేస్తున్నభూములకు అడంగల్ లో నమోదు చేయాలని అన్నారు
అదేవిధంగా సాగు పారాలు ఇవ్వాలన్నారు తాత్కాలికంగా పట్టాలు అనుభదారుల పట్టాలు మంజూరు చేయాలన్నారు
భూ కబ్జాదారుల పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేయలేదని అన్నారు వెంటనే రాజకీయ పలుకుబడి కలిగిన వారు ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేస్తున్న వారందరి పైన కేసులు నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి అన్వేషు జిల్లా కమిటీ సభ్యులు వెంబడి పోలయ్య వీరయ్య మండల అధ్యక్షులు వరికుంట్ల బాబు రాజశేఖర్ దాస్ కిరణ్ బాలుడు వీరితోపాటు రిలే దీక్షలో వరికుంట్ల ఆకుల నారాయణపల్లె సావిశెట్టి పల్లె కేఎన్ కొట్టాలా ఇటుకలపాడు మిద్దెల నాయన పల్లె గ్రామాలనుంచి వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు
0 Comments