బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణ బేరి ని జయప్రదం చేయండి* *BSP కడప జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప *



 
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న విజయవాడలో జరిగే దళిత రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప  కోరారు 
        ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య జిల్లా ఇన్చార్జ్ డిఎస్ జయరామ్ బాలచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా గుర్రప్ప   మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకమై దళితులపై నిరంతరం దాడులు దళిత స్త్రీలను మానభంగాలు చేయటం హత్యలు  చేస్తున్నారని దీనిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బందెల గౌతం కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత రణభేరి కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ వేల సంఖ్యలో హాజరవుతున్న సందర్భంగా కడప జిల్లాల్లో ఏడు అసెంబ్లీ నుండి వందలాదిగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు బీఎస్పీ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి వచ్చి  జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు 
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ ప్రొద్దుటూరు అసెంబ్లీ అధ్యక్షులు కిరణ్ మైదుకూరు అసెంబ్లీ అధ్యక్షులు రాజా చంద్ర తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments