మూడేళ్లుగా నిలిచిపోయిన కలవట్టు – వర్షాకాలంలో బీసీ కాలనీ ప్రజల కష్టాలు దారుణం

మూడేళ్లుగా నిలిచిపోయిన కలవట్టు – వర్షాకాలంలో బీసీ కాలనీ ప్రజల కష్టాలు దారుణం


పోరుమామిళ్ల మండలం సంచర్ల పంచాయితీ నాలుకుంట్ల బీసీ కాలనీ వద్ద గల కలవట్టు సరైన రీతిలో లేక, పూర్తిగా బురదతో మురికి నీటితో నిండిపోయి ఉంది. దాదాపు మూడు సంవత్సరాలుగా అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా, పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"ద్విచక్ర వాహనంపై వెళ్లాలన్నా, వాహనాలతో ధాన్యాలు తరలించాలన్నా, ఆటోలు రావాలన్నా కష్టమే. స్కూల్ పిల్లలు అవతలికి వెళ్లి బస్సు ఎక్కాలన్నా బురదలో మునిగి పోతున్నారు. ప్రతి రోజు షూలు మట్టి లోనే ఇరుక్కుపోతున్నాయి. వర్షాకాలం కాబట్టి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంట్లో నుంచి బయటకి రావడమే పెద్ద సవాలుగా మారింది" అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడ? మా ఇబ్బందులు కనబడవా? మేము మనుషులం కాదా?" అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి కలవట్టు పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు  డిమాండ్ చేస్తున్నారు. "ఇంకా నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళన తప్పదని, రోడ్డుపైనే పోరాటం చేస్తాం" అని స్పష్టంగా హెచ్చరించారు.

Post a Comment

0 Comments