మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి

 తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఆయన కుమారుడు బద్వేలు నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గార్లు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అడిగితెలుసుకొని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం ఆదిత్య రెడ్డి గారు మరింత కృషి చేయాలని సూచించారు.  నిత్యం ప్రజల్లో ఉంటూ  సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తలపై పెడుతున్న కష్టాలను ఎదుర్కొంటూ పోరాడుతున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారిని  జగన్ గారు అభినందించారు. 2029లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు.*

Post a Comment

0 Comments