.
పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో వున్న 6 వ నెంబర్ చౌక ధరల దుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చౌకధరల దుకాణంలో కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నారని తెలియగానే ప్రజలు ఒక్క సారిగా గుంపుగా తరలివచ్చి రేషన్ షాపుకు ఎగబడ్డంతో డీలర్ దిక్కు తోచక తలా ఒక కట్ట ప్రజల చేతికి ఇవ్వడం జరిగింది. లబ్ది దారులు ఒకరి నొకరు తోసుకుంటూ వెతుక్కుంటూ గందరగోళం సృష్టించారు. అలా ఇస్తే కార్డు మిస్ అయిపోతే ఎవరు భాద్యులు అంటూ విలేఖరులు రెవిన్యూ వారి దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన ఆర్ఐ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో చౌక దుకాణం వద్దకు చేరుకొని కాస్త ఆలస్యమైనా కార్డు దారులను క్యూ లో రప్పించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంపిణీ చేయాలని మందలించారు. ఏదయినా పొరపాటు జరిగితే అందరము కూడా భాద్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికయినా పంపిణీ భాద్యత డీలర్ల చేతికి ఇవ్వకుండా సచివాలయం ఉద్యోగుల ద్వారా కానీ, రెవెన్యూ సిబ్బంది ద్వారా గానీ చేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
0 Comments