ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ ...?


పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన సీపీఐ బృదం

పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్,ఈఎన్టీ డాక్టర్, మత్తు డాక్టర్,ఎక్సేరా తీసే డాక్టర్, దంత వైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందలేదని సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శిపిడుగు మస్తాన్, మండలకార్యదర్శిరవికు మార్,మండల సహాయ కార్యదర్శి కేశవ లు మండిపడ్డారు. శుక్రవారం పోరుమామిళ్ల పట్టణంలోని 50 పడ కల ప్రభుత్వాసుపత్రిని భారత కమ్యూనిస్టుపార్టీసీపీఐ తనబృందం తోపర్యటించిపరిశీలించారు.ఈసందర్భంగా వారు ఆసుపత్రిలో 50పడ కలు పరిశీలించగా బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.చంటిపిల్లల్నిఉంచే ఇంకుబేటర్లలో ఒక్కచంటిబిడ్డను ఒకగంటైనాఉంచినదాఖలాలులేవనిచెప్పవచ్చన్నారు.ఆసుపత్రిలో13 మందివైద్యులుఉండిరోగులకుచికిత్సలు అందించాల్సి ఉంది.కానీ ఇక్కడ 5 మంది వైద్యులను నియ మించారు.కేవలం ముగ్గురుడాక్టర్లు విధుల్లో ఉండి సేవలు అందిస్తున్నా రు.ప్రస్తుతం సీజనల్ వ్యాధులుప్రభ లి జనాలు భయాందోళనకు గురవు తున్నారన్నారు.ఇక్కడ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతోఉన్నవైద్యు లు సరైన వైద్యం అందించలేకపోతు న్నారన్నారు.ఏమాత్రంచిన్నరక్తగాయాలు జరిగినా,ప్రమాదం జరిగిన, ప్రసవ నొప్పులతో వచ్చినా ఇక్కడి వైద్యులు కడప,ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రులకు 108 అంబులెన్స్ కు రెపర్ చేసి ఎక్కించడమే గాని,చికి త్సలు అందించేందుకు వెనకాడుతు న్నారన్నారు. వైద్య సిబ్బందిరోగుల పట్లనిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారనిఆరోపణలున్నాయన్నారు.గతంలో ఇక్కడ కుటుంబనియంత్రణఆపరేష న్లు జరిగి మంచి పేరు ఆసుపత్రికి ఉండేదన్నారు.ఆయాసం వచ్చినా వెంటనే కడపకు పొమ్మనే చెబుతా రు గాని వైద్య చికిత్సలు చేయర న్నారు.మేము అన్నిసేవలుచేస్తున్నా మని అందరికి చెబుతున్నారు తప్ప సేవలుకనిపించడంలేదన్నారు.ఆసు పత్రి ఆవరణ సరిగా నిర్వహణ లేద న్నారు.కాలు విరిగిన,చెయ్యి బెనికి నా ఎక్సేరే తీసేవారు లేకపోవడంతో ఫ్రవేటు సెంటర్లలోకి వెళ్లి తీయించు కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నా యన్నారు.దంత వైద్యులు ఎక్కడ కనిపించడం లేదు.ఈవిషయం పై డాక్టర్ నాగలక్షి,డాక్టర్ రవి లను అడిగితే వారు గైనకాలజిస్ట్ ప్రసూతి సెలవుల్లో వెళ్లడంతో ఇక్కడగైనకాల జిస్ట్ డాక్టర్ లేరన్నారు.దీని కారణం గా ఇక్కడ ఆపరేషన్లు చేయక పోవ డంతోబెడ్లుఖాళీగాఉన్నాయన్నారు.ఏమి అడిగినా వైద్యులు లేరని చెబుతారుగాని,సమస్యలపైమాత్రం
దాటవేస్తున్నారన్నారు.రాత్రిపూట ఇక్కడేవిధుల్లోఉండిసేవలుఅందిస్తు న్నామని చెబుతారు అయితే జిల్లా ఆసుపత్రులకు పంపుతారని అడిగి తే మాకు మించినకేసులువస్తేపంపు తామంటున్నారన్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులను నియమించి ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయా లని కోరారు.ఈకార్యక్రమంలో పీరయ్యసఫా,చాంద్బాషా,షాహిదా,విశ్వాసమ్మ,గురమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments